Mobile Popup Ad
Mobile Popup Ad

విశాఖ సముద్రంలో గల్లంతైన ఏడుగురు మత్స్యకారులు సురక్షితం

కలం, వెబ్ డెస్క్ : విశాఖ (Visakhapatnam) ఫిషింగ్‌ హార్బర్‌ నుంచి సముద్రంలో చేపల వేటకు వెళ్లి గల్లంతైన ఏడుగురు మత్స్యకారులు సురక్షితంగా ఉన్నట్లు తేలింది. ఒడిశా తీరంలో ఏపీ మత్స్యకారులు క్షేమంగా ఉన్నారు. ఇంజిన్ లోపంతో సముద్రంలో బోటు నిలిచిపోయిందని గల్లంతైన మత్స్యకారులు వీడియో రిలీజ్ చేశారు. వీడియోపై అప్రమత్తమైన ఏపీ అధికారులు.. మత్స్యకారులను స్వస్థలాలకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు.

కాగా, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా సముద్రం అల్లకల్లోలంగా మారడంతో విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌ నుంచి సముద్రంలో ఈనెల 1వ తేదీన చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు గల్లంతుకావడం తీవ్ర ఆందోళనకు గురిచేసింది. గల్లంతైన మత్స్యకారులను రక్షించాలని వారి కుటుంబ సభ్యులు, బంధువులు ఫిషరీస్ కార్యాలయం ముందు బైఠాయించి రోదించారు. మత్స్యకారుల గల్లంతు సమాచారం అందుకున్న అధికారులు వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు. ప్రభుత్వ చర్యలతో గల్లంతైన ఏడుగురు మత్స్యకారులను రక్షించినట్లు రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి కె. అచ్చెన్నాయుడు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>