కలం, వెబ్ డెస్క్: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మరోసారి ఢిల్లీ పర్యటనకు సిద్ధమయ్యారు. ప్రధాని మోదీ అధ్యక్షతన జూన్ 11న నీతి అయోగ్ (NITI Aayog) 11వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రధానితో పాటు పలువురు కేంద్ర మంత్రులను కూడా కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి ప్రాజెక్టులు, కేంద్ర సహకారంపై చర్చించనున్నారు. గురువారం రాష్ట్రపతి భవన్‌లో ఉదయం 9.15 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో రాష్ట్రాల అభివృద్ధి, కేంద్ర,రాష్ట్ర సంబంధాలు, సంక్షేమ కార్యక్రమాలు తదితర అంశాలపై చర్చలు జరగనున్నాయి. సమావేశం ముగిసిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి అదే రోజు సాయంత్రం ఢిల్లీ నుంచి బయలుదేరి రాష్ట్రానికి రానున్నారు.

