Mobile Popup Ad
Mobile Popup Ad

నారాయణపేట జిల్లాలో న్యాయ సేవలపై విజ్ఞాన సదస్సు

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: నారాయణపేట (Narayanpet) జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం షేర్నపల్లి గ్రామంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. జిల్లా చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ లక్ష్మీపతి గౌడ్ హాజరై మాట్లాడారు. రైతులు భూసార పరీక్షలు నిర్వహించుకుని పంటల బీమా చేయించుకుంటే, విపత్తుల సమయాల్లో నష్టాలను అధిగమించవచ్చని తెలిపారు. నిత్యాసర సరకుల చట్టం ప్రకారం, విత్తనాలు కొనుగోళ్ల రసీదులను జాగ్రత్తగా దాచుకుంటే, నష్ట పరిహారం పొందే వెసలుబాటు ఉంటుందన్నారు. ఆడ పిల్లలకు చిన్న వయస్సులో పెళ్లిళ్లు చేయడం నేరమని తెలిపారు. ఎలాంటి న్యాయ సాయం కావాలన్నా జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ట్రోల్ ఫ్రీ నెంబర్ 15100కి కాల్ చేయొచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచి అనురాధ, పంచాయతీ సెక్రటరీ శైలజ, కానిస్టేబుల్ శ్యామప్ప, అంగన్వాడీ టీచర్ భాగ్యరేఖ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>