కలం, మహబూబ్‌నగర్ బ్యూరో: సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) గురువారం నల్లమలకు రానున్నారు. స్థానికంగా రూ.450 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నా మద్దిమడుగు ఆంజనేయస్వామి ఆలయ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టున్నారు. రూ.71 కోట్లతో మద్దిమడుగు(Maddimadugu)లో వివిధ అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపనలు చేయనున్నారు. ఆంజనేయ స్వామి సన్నిధిలో భక్తుల సౌకర్యార్థం రూ.15 కోట్లతో హరిత హోటల్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. అలాగే రూ.18 కోట్లతో పబ్బతి ఆంజనేయస్వామి దేవాలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. రూ.38 కోట్లతో సంత్ సేవాలాల్ మహారాజ్ భారీ విగ్రహావిష్కరణకు శంకుస్థాపన చేయనున్నారు.
అనంతరం అచ్చంపేట(Achampet)లో రూ. 274.32 కోట్లతో బీటీ రోడ్ల నిర్మాణానికి, రూ 29.65 కోట్లతో నాగర్‌కర్నూల్, పెద్దకొత్తపల్లి, వెల్దండ మండలాల్లో పబ్లిక్ స్కూల్స్ నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నారు. అచ్చంపేట మున్సిపాలిటీలో వివిధ అభివృద్ధి పనులకు పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే అచ్చంపేట నియోజకవర్గంలోని వివిధ పాఠశాలల్లో అదనపు గదుల నిర్మాణానికి గాను రూ.18.105 కోట్లతో 130 పాఠశాలల్లో పనులు చేపట్టేందుకు శంకుస్థాపనలు చేయనున్నారు. రూ.14 కోట్లతో అమ్రాబాద్ మండల మన్ననూర్ గ్రామంలో ఐటీడీఏ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. రూ.2 కోట్లతో అచ్చంపేటలో ఆదివాసీ భవన్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు.
పాదయాత్రగా సభా వేదికకు
నల్లమల అటవీ ప్రాంతంలోని మద్దిమడుగు ఆంజనేయస్వామి ఆలయంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన అనంతరం హెలికాఫ్టర్‌లో అచ్చంపేటకు చేరుకుంటారు. అక్కడి నుంచి బహిరంగ సభ వేదిక వరకు వేలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలతో పాదయాత్ర నిర్వహించనున్నారు. సభా వేదిక నుంచి మహిళలకు ఉచిత ఇందిరమ్మ చీరలు (Indiramma Sarees) పంపిణీ కార్యక్రమం చేపట్టనున్నారు. బహిరంగ ప్రదేశం నుండి అచ్చంపేటలో చేపట్టి వివిధ అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) శంకుస్థాపనలు చేయనున్నారు.
Also Read : యాదాద్రి భక్తులకు ముఖ్య గమనిక.. పూజా వేళల్లో భారీ మార్పులు!
Follow Us On: X(Twitter)

