ధర్మపురి అభివృద్ధిపై మంత్రి కీలక ప్రకటన

కలం, ధర్మపురి: వచ్చే సంక్రాంతి తర్వాత ధర్మపురి (Dharmapuri) నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో అభివృద్ధి పనులను శరవేగంగా చేపడతామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (Minister Adluri) స్పష్టం చేశారు. బుధవారం ధర్మపురి ఎంపీడీవో కార్యాలయంలో నూతనంగా మంజూరైన చేయూత పింఛన్ల మంజూరు పత్రాలను లబ్ధిదారులకు మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాటు అధికారంలో ఉన్నప్పటికీ అర్హులైన వారికి పింఛన్లు మంజూరు చేయలేదని అన్నారు. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజా ప్రభుత్వం అర్హులకు చేయూత పింఛన్లు అందిస్తోందని తెలిపారు. ధర్మపురి మండలానికి కొత్తగా 743 చేయూత పింఛన్లు మంజూరైనట్లు వెల్లడించారు.

ధర్మపురి మండలంలో 1,312 మందికి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయడంతో పాటు, రేషన్ కార్డుల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా మండలంలో 660 మందికి ఇళ్లు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. వచ్చే సంక్రాంతి నుంచి గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపడతామని లక్ష్మణ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సంగనభట్ల దినేష్, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు చిలుముల లక్ష్మణ్‌తో పాటు మండలంలోని పలువురు సర్పంచులు, ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>