సైబ‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ భ‌వ‌నానికి సీఎం శంకుస్థాప‌న‌

క‌లం, వెబ్ డెస్క్‌: సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా తెలంగాణ స‌ర్కార్ ప‌లు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మియాపూర్ వేదికగా మొత్తం రూ.1,674.74 కోట్ల భారీ వ్యయంతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఇందులో భాగంగా, ఖానామెట్ పరిధిలో రూ.161 కోట్లతో అత్యాధునికంగా నిర్మించనున్న సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నూతన ప్రధాన కార్యాలయ భవన నిర్మాణానికి సీఎం శంకుస్థాప‌న చేశారు. అలాగే మియాపూర్ చౌరస్తాలో ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు రూ.530 కోట్లతో నిర్మించనున్న భారీ ఫ్లైఓవర్ పనులకు భూమి పూజ చేశారు. రూ.65.53 కోట్లతో పూర్తయిన బాచుపల్లి ఫ్లై ఓవర్‌ను ప్రారంభించిన సీఎం దానిని ప్రజలకు అంకితం చేశారు.

వీటితో పాటు రూ.308 కోట్ల‌తో శేరిలింగంపల్లి ఆర్‌ఓబీ, రూ.229 కోట్ల‌తో ఓఆర్‌ఆర్ సర్వీస్ రోడ్ల విస్తరణ ప‌నుల‌కు సీఎం శ్రీకారం చుట్టారు. రూ.110 కోట్లతో శంకర్ పల్లి రోడ్డు ఎంజీఐటీ నుంచి మణికొండ వరకు పైప్ లైన్ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రూ.29.25 కోట్లతో కొల్లూరు ఇంటర్‌చేంజ్ సమీపంలోని రెండు రైల్వే ఓవర్ హెడ్స్ వరకు 4 లేన్ల అప్రోచ్ ర్యాంపుల నిర్మాణానికి భూమి పూజ చేశారు. రూ.26.50 కోట్లతో నానక్‌రామ్‌గూడ నుంచి గచ్చిబౌలి వరకు ఓఆర్ఆర్ ఎడమ వైపు ఉన్న ప్రధాన క్యారేజ్ వే విస్తరణకు శంకుస్థాపన చేశారు. రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్, రూ.14.40 కోట్లతో మాదాపూర్‌, నానక్ రామ్ గూడలో వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు.

Read Also: ఆసియన్ టూర్ టాప్-10లో కరందీప్ కోచ్చర్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>