Mobile Popup Ad
Mobile Popup Ad

నైటుకు రేటు ఎంత అని అడుగుతారా.. ట్రోలర్లపై రేణు దేశాయ్ ఫైర్!

కలం, వెబ్ డెస్క్: సినీ నటి రేణు దేశాయ్ (Renu Desai) సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. సామాజిక సమస్యలపై తరుచుగా స్పందిస్తుంటారామె. ఈ నేపథ్యంలో నెటిజన్స్ ఆగ్రహానికి గురైన సందర్భాలెన్నో ఉన్నాయి. అయినా రేణు దేశాయ్ వెనక్కి తగ్గకుండా సోషల్ మీడియా (Social Media)లో ఏదో ఒక విషయమై పోస్టులు పెడుతూనే ఉంటారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న అనుచిత వ్యాఖ్యలపై నటి రేణు దేశాయ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

తాను దేవుని మాల ధరించి ఉన్న సమయంలో కూడా కొందరు ‘రాత్రికి నీ రేటు ఎంత?’ అంటూ అడుగుతుండటంపై ఆమె మండిపడ్డారు. ‘‘మీకు తినే పరిస్థితి కూడా లేదు, అలాంటిది నన్ను ఇలా అడగడానికి మనసు ఎలా వచ్చింది’’ అంటూ నెటిజన్‌ను నిలదీశారు. అలాగే తన వ్యక్తిగత విషయాలపై స్పందిస్తూ.. ‘‘నేనేమీ ఎమ్మెల్యేను కాదు, కేవలం మనిషిని మాత్రమే. ప్రతి విషయానికీ నన్నెందుకు బాధ్యురాలిని చేస్తూ ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు?’’ అని ట్రోలర్లకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుతం రేణు దేశాయ్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>