కలం, వెబ్ డెస్క్: సంక్షేమ హాస్టళ్ల నిర్వహణ, పాఠశాలలపై సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) సుదీర్ఘ సమీక్ష చేసి కీలక ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులకు దుస్తులు, పుస్తకాలు, నోట్ బుక్స్, ఇతర వస్తువుల సరఫరాలో అక్రమాలను అరికట్టేందుకు సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్ మెంట్ విధానాన్ని అనుసరించాలని అధికారులకు సూచించారు. సంక్షేమ పథకాలు సరఫరాదారుల కోసం కాదని.. లబ్ధిదారుల కోసం కాదని వివరించారు. విద్యార్థులకు అందించే విద్యార్థులకు అందజేసే నోటు పుస్తకాలు, ట్రంక్ పెట్టెలు, ప్లేట్లు, గ్లాసులు, ట్రాక్ సూట్లు, బెడ్ షీట్లు, స్కూల్ బ్యాగులు, ఐడీ కార్డులు, యూనిఫాంల నాణ్యత విషయంలో రాజీ పడొద్దని స్పష్టం చేశారు. జూన్ 15 నాటికి పిల్లల యూనిఫారాలు పాఠశాలలకు చేరేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
విద్యార్థుల నుంచి ఫీడ్ బ్యాక్ రావాలి..
విద్యార్థులకు అందజేసే వస్తువులకు సంబంధిత మండల స్థాయిలో ఒక నోడల్ అధికారిని నియమించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అక్కడి నుంచి గ్రామాల్లోని పాఠశాలలు, హాస్టళ్లకు వస్తువులు పంపిణీ జరిగేలా చర్యలు చేపట్టాలన్నారు. పంపిణీకి సంబంధించి ఎప్పటికప్పుడు ఫొటోలు, వీడియోలు తీయించడంతో పాటు, ప్రతి విద్యార్థికి వారికి అవసరమైన సామగ్రి అంతా అందిందా లేదా అనే దానిని తనిఖీ చేసుకోవాలన్నారు. విద్యార్థులకు అన్ని రకాల వస్తువులు అందిన తరువాత, అవెలా ఉన్నాఆయో వారి నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోవాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, విద్యా శాఖల మధ్య సమన్వయానికి ఒక కమిటీని నియమించాలన్నారు.

