Mobile Popup Ad
Mobile Popup Ad

‘ఎక్కడికి వెళ్లొద్దు’.. పార్టీ అభ్యర్థులకు విజయ్ వార్నింగ్

కలం, వెబ్‌ డెస్క్: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో భాగంగా కొన్ని ఎగ్జిట్ పోల్స్ టీవీకేకు అనుకూలంగా రిపోర్ట్స్ ఇచ్చిన నేపథ్యంలో పార్టీ అధ్యక్షుడు విజయ్ (Vijay) 234 మంది అభ్యర్థులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారికి స్వీట్ వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. గెలిచిన అభ్యర్థి.. నేరుగా పనైయూర్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయానికే రావాలని ఆదేశించారు. గెలుపు సంబురాల పేరిట ఎవరూ కూడా కౌంటింగ్ కేంద్రాల నుంచి నేరుగా తమ తమ నియోజకవర్గాలకు వెళ్లొద్దని సూచించారు. అందరూ ఇక్కడికి వచ్చాకే.. నియోజకవర్గాలకు వెళ్లాల్సి ఉంటుందని సూచించారు. మీ కోసం ఇక్కడే ఎదురు చూస్తుంటానని.. టీవీకే కచ్చితంగా గెలవబోతుందనే విశ్వాసం తనకు ఉందని విజయ్ చెప్పినట్లు తెలుస్తోంది.

ఫలితాలపై ఎడతెగని ఉత్కంఠ..

తమిళనాడు ఎన్నికల ఫలితాలపై దేశ వ్యాప్తంగా ఉత్కంఠ పెరుగుతోంది. మే 4న కౌంటింగ్ జరగబోతుండగా.. ఎవరూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. డీఎంకే మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందా.. లేకపోతే, తమిళ ఓటర్లు గతంలో మాదిరే ఈసారి అన్నాడీఎంకేకు అవకాశం ఇస్తారా.. అనేది చర్చగా మారింది. అన్నింటికీ మించి, అసలు విజయ్ ఎన్ని సీట్లు గెలవబోతున్నాడనేది అత్యంత ఆసక్తికరంగా మారింది. దేశంలోనే ప్రముఖ ఎగ్జిట్ పోల్స్ సంస్థగా గుర్తింపు ఉన్న మై యాక్సిస్ ఇండియా.. టీవీకే పార్టీనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని రిపోర్ట్ ఇవ్వడంతో సంచలనంగా మారింది. తమిళనాడులో ఈసారి ఎవరూ గెలిచినా.. అదొక రికార్డుగా నిలవబోతుందనేది రాజకీయ విశ్లేషకుల మాట.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>