Mobile Popup Ad
Mobile Popup Ad

సీఎం రేవంత్ సంచలన నిర్ణయం.. బండి భగీరథ్‌పై విచారణకు ఆదేశం

కలం, వెబ్ డెస్క్: కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసులో తక్షణమే విచారణ చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) డీజీపీ సీవీ.ఆనంద్‌ను ఆదేశించారు. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో బండి భగీరథ్‌పై 8వ తేదీనే ఫిర్యాదు వస్తే, ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని డీజీపీని ప్రశ్నించారు. ఈ మేరకు డీజీపీకి ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. ప్రధాని హైదరాబాద్ పర్యటన భద్రతా ఏర్పాట్లలో పోలీస్ అధికారులు, సిబ్బంది నిమగ్నమై ఉండటంతోనే.. విచారణ కొంత ఆలస్యమైనట్లు డీజీపీ వివరించారు. కేసు సమగ్ర విచారణ కోసం ప్రత్యేక టీంలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి డీజీపీని ఆదేశించారు.

బండి తనయుడిపై సర్వత్రా విమర్శలు..

మైనర్ అయిన తమ కుమార్తెను ట్రాప్ చేసి, అత్యాచారం చేయడమే కాకుండా, ఇదేంటని ప్రశ్నించినందుకు తమను భయభ్రాంతులకు గురి చేసేలా భగీరథ్, అతడి తండ్రి బండి సంజయ్ వేధించారని బాధితురాలి తల్లి ఫిర్యాదులో స్పష్టంగా పేర్కొంది. దీంతో, వీరిద్దరిపై గత మూడు రోజులుగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పోక్సో కేసులో నిందితులను వెంటనే అరెస్ట్ చేయాల్సి ఉన్నా.. జాప్యం చేస్తుండటంపైనా భిన్నాభిప్రాయాలు వచ్చాయి. ఎట్టకేలకు, సీఎం స్వయంగా కల్పించుకోవడంతో కేసు విచారణ వేగవంతం అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>