Mobile Popup Ad
Mobile Popup Ad

బండి సంజయ్ కొడుకు వివాదం.. స్పందించిన బాలల హక్కుల పరిరక్షణ కమిషన్

కలం, స్పోర్ట్స్ : పేట్ బ‌షీరాబాద్ పోలీస్ స్టేష‌న్ లో బండి సంజయ్ కొడుకు బండి భ‌గీర‌థ్ (Bandi Bhagirath) మీద‌ న‌మోదైన ఫోక్సో కేసు పైన తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (TSCPCR) చైర్‌పర్సన్‌ కొత్తకోట సీతా దయాకర్ రెడ్డి స్పందించారు. న‌గ‌ర పోలీస్ క‌మిష‌న‌ర్ నుంచి వివ‌రాలు తెప్పించుకుని విచార‌ణ కోసం ప్ర‌త్యేక బెంచ్ ఏర్పాటు చేశారు.

బండి భ‌గీర‌థ్ పైన నమోదైన పోక్సో కేసులో పోలీసుల విచారణ నత్తనడకన సాగుతున్నదని, ఇప్పటివరకు నిందితుడిని అరెస్టు చేయలేదంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ మహిళా, యువజన, విద్యార్థి విభాగాలు సైతం పేట్‌బషీరాబాద్ పోలీసు స్టేషన్, డీజీపీ ఆఫీసు ఎదుట నిరసనలు చేస్తున్నాయి.

మరోవైపు రాష్ట్ర మహిళా కమిషన్‌ను సంప్రదించి బాధితురాలికి తగిన న్యాయం చేయాలని బీఆర్ఎస్ మహిళా విభాగం సైతం ప్రయత్నిస్తున్నది. ఇలాంటి సమయంలో రాష్ట్ర బాలల హక్కుల సంఘం స్పందించడం గమనార్హం.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>