Mobile Popup Ad
Mobile Popup Ad

సీఎం రేవంత్ రెడ్డితో సీపీఎం బృందం భేటీ

కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్ లోని సెక్రటేరియట్ లో సోమవారం సీఎం రేవంత్ రెడ్డి ( CM Revanth Reddy)తో రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ నేతృత్వం లో సీపీఎం బృందం సమావేశం అయ్యింది. ఈ సమావేశానికి మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, పి. సుదర్శన్ ,జ్యోతి, నున్నా నాగేశ్వరరావు, మల్లు లక్ష్మి , సామినేని స్వరాజ్యం , ఎం. గోపాలరావు,రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కనీస వేతనాల సవరణ చట్టం తీసుకురావడం పైన సీపీఎం బృందం సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.

సీపీఎం నేతలతో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

ఈ సమావేశంలో కేంద్రంపై సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కేంద్రం మద్దతు ధరలు ప్రకటించి గింజ కొనడం లేదని, పండిన పంట లో 30 శాతం కూడా సేకరించడం లేదని ఆరోపించారు. ఈ సందర్భంగా పంట కొనుగోలు పైన కేంద్రాన్ని ప్రశ్నించాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రస్తుతం రైతులు పండించిన ప్రతి గింజ కొనుగోలు చేస్తున్నామని వెల్లడించారు. అయితే బెంగాల్ ఎన్నికల వల్ల కొంత హమాలీల కొరత ఏర్పడిందని, ఎండ వల్ల మధ్యాహ్నం సమయంలో పని జరగడం లేదని వివరించారు. రాష్ట్రంలో కొనుగోళ్ల పైన నిరంతరం సమీక్ష చేస్తున్నామని, 500 రూపాయల బోనస్ ఇచ్చి సన్న వడ్లు కొనుగోలు చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మొక్కజొన్న ను మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నట్లు గుర్తు చేశారు.

మూసీ నిర్వాసితులకు స్థానికం గానే నివాసాలు మంజూరు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మూసీ పైన బీఆర్ఎస్, బీజేపీ రాజకీయం చేస్తున్నాయన్న సీఎం.. మూసీ ని అద్భుతమైన పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామన్నారు. మూసీ ప్రాజెక్ట్ వల్ల యువత కు ఉపాధి లభిస్తుందని చెప్పుకొచ్చారు. మూసీ కాలుష్యం వల్ల నల్గొండ జిల్లా ప్రజలు రోగాల బారిన పడుతున్నారని, నగర ప్రజలకు క్వాలిటీ లైఫ్ ఇవ్వడమే తమ ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు.

అలాగే ప్రభుత్వ విద్య ను ప్రక్షాళన చేస్తున్నానని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. నాణ్యమైన విద్య అందించే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని, విద్యార్థులకు నాణ్యమైన బ్రేక్ ఫాస్ట్,భోజనం అందిస్తున్నామని వెల్లడించారు. విద్యార్థుల కోసం తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఈ క్రమంలోనే ఆరుట్ల స్కూల్ ను సీపీఎం నాయకులు ఒకసారి సందర్శించాలని కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>