Mobile Popup Ad
Mobile Popup Ad

సొంత చెల్లెల్ని తిడుతుంటే కేటీఆర్‌కు పట్టదా : సీఎం రేవంత్

కలం, వెబ్ డెస్క్ : అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ (Revanth) మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం మహిళల కోసం తెచ్చిన సంక్షేమ పథకాలను వివరించారు. మహాలక్ష్మి పథకం తీసుకొచ్చినందుకు తమను అభినందించాల్సింది పోయి.. తిట్టడం ఏంటని సీఎం మండిపడ్డారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడానికి తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని.. కానీ వాళ్ల ఇంట్లో ఆస్తి పంపకాలతో ఆడబిడ్డను ఇబ్బంది పెడుతున్నారని సీఎం రేవంత్ (Revanth) విమర్శించారు.

‘ఆడబిడ్డపై వారికి చిన్నచూపు ఉంది. బీఆర్ ఎస్ మొదటి ప్రభుత్వంలో ఒక్క మంత్రి పదవి కూడా మహిళలకు ఇవ్వలేదు వాళ్లు. మేం తెచ్చిన మహిళా విధానాలను అభినందించాల్సిన బాధ్యత వారికి లేదు. ఆడబిడ్డ ఏడ్చుకుంటూ వీధిలోకి వస్తే ఇంటికి మంచి జరగదు. ఎక్కడైతే ఆడబిడ్డ కన్నీరు పెడితే అక్కడ కష్టాలే తప్ప ఇంక ఏమీ మిగలవని చరిత్ర చెబుతోంది. కాబట్టి ఇప్పటికైనా ఇంటి ఆడబిడ్డకు కొంత పంచండి. మొత్తం తినాలనే దురాశ పెట్టుకోకండి. ఉన్నదాంట్లో తలా కొంత పంచుకుంటే సరిపోద్ది. పదే పదే నన్ను తిడుతున్నారు గానీ.. మీ సొంత ఇంటి ఆడబిడ్డను లిక్కర్ రాణి, లిక్కర్ కింగ్ అని బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు అంటుంటే.. సోదరుడిగా కనీసం నీకు చీమకుట్టినట్టైనా ఉండదా కేటీఆర్. ఈ ఒక్క షయంలో మొత్తం మహిళా సమాజంపై వారి విధానం ఏంటో అర్థమైపోయింది. ఎన్నో భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు కానీ… సొంత ఇంటి ఆడబిడ్డను సొంత మనుషులు, ఎమ్మెల్యేలతో తిట్టించడం ఏంటి. కనీసం వారిని నియంత్రించకపోవడం బట్టి చూస్తే.. వీరికి మహిళలపై ఉన్న విధానం ఏంటో అర్థమైపోతోంది అని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>