ట్రంప్ డైరెక్షన్‌లో మోదీ పాలన..! : ఎంపీ చామల

కలం, నల్లగొండ బ్యూరో: పార్లమెంట్ లో చర్చ జరగాల్సిన అంశాలను ట్రంప్ ఎలా డిసైడ్ చేస్తారని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (MP Chamala) ప్రశ్నించారు. అమెరికా నుంచి దిగుమతులపై సుంకాలను వైట్ హౌస్ నుంచి ట్రంప్ డిసైడ్ చేశారన్నారు. మోదీ (PM Modi) ఎందుకు ట్రంప్ తో కాంప్రమైజ్ అయ్యారో దేశ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నరేంద్రమోదీ ప్రధానమంత్రిగా కాకుండా ట్రంప్ ఆదేశాలకు అనుగుణంగా పని చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

గ్యాస్, క్రూడాయిల్ ధరలు విపరీతంగా పెంచారని, దీనిపై లోక్ సభలో చర్చ చేపట్టాలని, రష్యా నుంచి నెల రోజులు క్రూడాయిల్ కొనుక్కోవాలని ట్రంప్ ఇండియాకు చెబుతున్నారని, భారత్ పై ట్రంప్ ఆధిపత్యం చెలాయిస్తున్నారని చామల అన్నారు. ఇండియా ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమని, ఏ దేశం పైన ఇండియా ఆధారపడాల్సిన అవసరం లేదన్నారు. ఏ నాయకుడి ఆదేశాల మేరకూ ఇండియా పని చేయవద్దని, భారత్ పై ట్రంప్ ఎందుకు ఒత్తిడి తెస్తున్నారో మోదీ చెప్పాలని డిమాండ్​ చేశారు.

లోక్ సభలో ఎనిమిది మంది ఎంపీలను సస్పెండ్ చేసిన అంశంపై చర్చ జరగాలని, లోక్ సభ స్పీకర్ పై అవిశ్వాసం సందర్భంగా ఎనిమిది మంది ఎంపీలకు ఓటు వేసే అవకాశం ఇవ్వాలని చామల (MP Chamala) తెలిపారు. పార్లమెంట్ రెండవ విడత బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయని, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాపై (Om Birla) అవిశ్వాస తీర్మానం పెట్టామని గుర్తు చేశారు. ప్రతిపక్ష పార్టీల ఎంపీలను, లోక్ సభ ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని మాట్లాడనీయకుండా స్పీకర్ అడ్డుకుంటున్నారని ఆరోపించారు.

బీజేపీ ఎంపీలు, ఎన్డీఏ ఎంపీలకు లోక్ సభ స్పీకర్ ప్రాధాన్యత ఇస్తున్నారని, స్పీకర్ అనే వ్యక్తి లోక్ సభలో ఉన్న అందరికి మాట్లాడే అవకాశం ఇవ్వాలని పేర్కొన్నారు. లోక్ సభలో ప్రతిపక్షాలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని, రాహుల్ గాంధీ మాట్లాడే ప్రతిసారి డిస్ట్రబ్ చేస్తున్నారని, నిశికాంత్ ధూబే, అనురాగ్ ఠాకూర్ లాంటి వాళ్లకు అవసరం లేకపోయినా మైక్ ఇస్తున్నారని మండిపడ్డారు. దేశంలో ఉన్న ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇచ్చే విధంగా లోక్ సభను నడుపుతున్నారని, మహిళా ఎంపీలు ప్రధానమంత్రి నరేంద్రమోదీపై దాడి చేయాలని చూశారంటూ తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చారని పేర్కొన్నారు. అందుకే లోక్ సభ స్పీకర్ పై అవిశ్వాసం పెట్టామని, ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధంపై లోక్ సభలో చర్చ చేయాలని అన్నారు.

Read Also: ఇద్దరు యువతుల సూసైడ్.. ఏఐ సెర్చ్ హిస్టరీలో క్లూ

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>