కలం, వెబ్ డెస్క్: కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక గాంధీల అరెస్టులకు నిరసనగా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) బుధవారం ధర్నాకు దిగారు. కొడంగల్‌లోని తన నివాసం నుంచి కిలోమీటర్ దూరంలో ఉన్న అంబేడ్కర్ విగ్రహం వరకు ర్యాలీగా వెళ్లారు. అనంతరం ఆయన మీడియానుద్దేశించి మాట్లాడారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ప్రశ్నాపత్రాలను అమ్ముకుంటున్నారని ఆరోపించారు.
నీట్ ప్రశ్నపత్రాలను పల్లీబఠానీల్లా కోట్ల రూపాయలకు విక్రయించారని మండిపడ్డారు. విద్యార్థుల జీవితాలతో ఆటలు ఆడుకుంటే ఊరుకునేది లేదన్నారు. రాజకీయ పార్టీలకతీతంగా దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయన్నారు. ప్రజా ఆందోళనలు పరిగణనలోకి తీసుకుని ధర్మేంద్ర ప్రధాన్‌ను కేంద్ర మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలన్నారు. నీట్ ప్రశ్నపత్రాలు అమ్ముకున్న వారిని, అరెస్టు చేసి జైల్లో పెట్టాలని సీఎం రేవంత్ డిమాండ్ చేశారు.

