Mobile Popup Ad
Mobile Popup Ad

రాష్ట్రంలో సీఎస్ఆర్ నిధులు పెరగాలి: సీఎం రేవంత్

కలం, వెబ్ డెస్క్ : కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటి ఫండ్స్(CSR) పైన శాసన మండలి కాన్ఫరెన్స్ హాల్ లో గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు,స్పెషల్ సీఎస్ సబ్యసాచి ఘోష్, సిఎంఓ ముఖ్యకార్యదర్శి శేషాద్రి, సిఎంఓ ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, సిఎంఓ కార్యదర్శి మాణిక్ రాజ్ ,ఉన్నతాధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కంపెనీ నడుపుతూ వేరే చోట కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్​బిలిటీ(సీఎస్‌ఆర్) నిధులు ఖర్చు చేస్తామంటే ఎలా అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

ఇప్పటివరకు వచ్చిన CSR ఫండ్స్ మెరుగ్గా లేవన్న సీఎం..రాష్ట్రానికి మరిన్ని సీఎస్ఆర్ ఫండ్స్ రావాల్సిన అవసరం ఉందన్నారు. కంపెనీలు కనీసం 50శాతం సీఎస్ఆర్‌ నిధులు ఇక్కడే ఖర్చు చేయాలని సూచించారు. రాష్ట్రంలో సీఎస్ఆర్ నిధులు పెరిగేలా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. సీఎస్‌ఆర్ నిధుల కోసం ప్రత్యేక వ్యవస్థ, వెబ్‌సైట్ ఏర్పాటు చేయాలని, సీఎస్‌ఆర్ నిధులకు ఇతర రాష్ట్రాల విధానాలు అధ్యయనం చేయాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy  ) అధికారులకు సూచించారు.రాష్ట్రం లో సీఎస్‌ఆర్ ఫండ్స్ ఎక్కువ ఖర్చు చేసిన వారిని గుర్తించి ప్రభుత్వం తరపున సత్కరించాలని తెలిపారు. కాగా, సీఎస్‌ఆర్ ఫండ్స్ అంటే కార్పొరేట్ కంపెనీలు తమ నికర లాభంలో కొంత భాగాన్ని సామాజిక బాధ్యతగా విద్య, ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ వంటి అభివృద్ధి పనులకు వెచ్చించే నిధులు.

Read Also: ఒప్పందంపై లేట్ చేయొద్దు.. ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>