బెంగళూరు పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి

కలం, వెబ్ డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) బెంగళూరు పర్యటనకు వెళ్లారు. మధ్యాహ్నం 12:30 గంటలకు అక్కడ నిర్వహించే ‘ది హిందూ హడిల్’ కార్యక్రమంలో పాల్గొంటారు. దేశ వ్యాప్తంగా తాజా రాజకీయాలతో పాటు తెలంగాణ గ్రోత్‌పై కీలక ప్రసంగం చేయబోతున్నారు. ఈ మేరకు ప్రత్యేక విమానంలో బయల్దేరి వెళ్లారు. సీఎం వెంట పలువురు కీలక నేతలు కూడా ఉన్నారు. సాయంత్రం తిరిగి హైదరాబాద్ చేరుకోనున్న సీఎం రేవంత్ రెడ్డి ఆరు గంటలకు కోహెడలో (Koheda) అంతర్జాతీయ ఇంటిగ్రేటెడ్ ఫ్రూట్ మార్కెట్, ఇంటిగ్రేటెడ్ సబ్-రిజిస్ట్రార్ ఆఫీస్ కాంప్లెక్స్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయబోతున్నారు.

రూ.1000 కోట్లతో పండ్ల మార్కెట్ నిర్మాణం..

కోహెడలో ఔటర్ రింగ్ రోడ్డును ఆనుకుని 239 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో రూ. 1,091 కోట్ల అంచనా వ్యయంతో దీనిని నిర్మిస్తున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు (Minister Tummala) తెలిపారు. దేశంలోనే ఇప్పటివరకు పెద్దదిగా ఉన్న దిల్లీలోని ప్రసిద్ధ ఆజాద్‌పూర్ మార్కెట్ కంటే కోహెడ్ మార్కెట్ ఎన్నో రెట్లు ఎక్కువగా ఉండబోతుంది. ఈ మార్కెట్‌లో 70 శాతం కేవలం పండ్ల వ్యాపారానికే కేటాయించబోతున్నారు. వంద అడుగుల ఎత్తుతో భారీ ఐకానిక్ టవర్‌ను నిర్మిస్తున్నారు.

Read Also: నార్వే చెస్ 2026 ఛాంపియన్ ప్రజ్ఞానంద..

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>