కలం, వెబ్ డెస్క్: పుత్తడి ప్రియులకు బంగారం ధరలు భారీ ఉరటనిచ్చాయి. గత కొన్ని నెలలుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు.. కాస్త తగ్గుతూ వస్తున్నాయి. శనివారం బంగారం, వెండి ధరల్లో (Gold and Silver Price) భారీ మార్పు చోటుచేసుకుంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ.3,000 తగ్గి రూ.1,52,730కుచేరింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.2,750 పతనమై రూ.1,40,000 వద్ద కొనసాగుతోంది. మరోవైపు కిలో వెండి రూ.10 వేలు తగ్గి రూ.2,65,000 వద్ద ట్రేడవుతోంది. భారీగా బంగారం ధరలు తగ్గుముఖం పట్టడంతో గోల్డ్ కొనేవారిలో ఉత్సాహం నెలకొంది. తెలంగాణ, ఏపీలో దాదాపు ఇవే ధరలు అమలులో ఉండనున్నాయి.
హైదరాబాద్ మార్కెట్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 3,000 తగ్గి రూ.1,52,730గా ఉంది. 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 2,750 తగ్గి రూ. 1,40,000గా నమోదయింది. విజయవాడలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,52,730 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,40,000 పలుకుతోంది. విశాఖలో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.1,52,730 వద్ద ఉండగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,40,000 పలుకుతోంది. చెన్నైలో 10 గ్రాముల 24 క్యారెట్ల పుత్తడి ధర రూ.1,54,910గా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,42,000 వద్ద నిలిచింది. ముంబై నగరంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,52,730 దగ్గర ట్రేడ్ అవుతోంది. 22 క్యారోట్ల గోల్డ్ రేట్ రూ.1,40,000 పలుకుతోంది. ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,55,910 దగ్గర ట్రేడ్ అవుతోంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,40,150 పలుకుతోంది. బెంగళూరులో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.1,52,730 దగ్గర ట్రేడ్ అవుతోంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,40,000 పలుకుతోంది.

