కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రంపై పెద్ద మనసు చూపి రాష్ట్రానికి సాయం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ని కోరారు. HICCలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు పీఎం వర్చువల్ గా ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడారు. గతంలో ప్రధానిగా ఉన్న మన్మోహన్ సింగ్ లాగా, ఇప్పుడు సహకారం కావాలని మోదీకి విజ్ఞప్తి చేశారు. దేశంలో 6 నగరాలను గ్రోత్ ఇంజిన్‌లాగా అభివృద్ధి చేయాలని సూచించారు. టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసి సింగిల్ విండో ద్వారా అనుమతులు ఇవ్వాలని ఆయన (CM Revanth Reddy) రిక్వెస్ట్ చేశారు.
దేశం అభివృద్ధి చెందుతున్నంత వేగంగా తెలంగాణ అభివృద్ధి చెందాలనుకుంటుందని, అందుకు ప్రధాని సహకారం కావాలన్నారు. మచిలీపట్నం పోర్టు వరకు వేగంగా రైల్వే లైన్ వేయాలని.. పెండింగ్ ప్రాజెక్టులకు వెంటనే అనుమతులు ఇవ్వాలని కోరారు. ప్రధాని మోడీది పెద్దమనసని బండి సంజయ్, కిషన్ రెడ్డి చెబుతారని.. తెలంగాణపై కూడా పెద్ద మనసు చూపించాలని సీఎం విన్నవించారు. ఇది వికాస ఉత్సవం అని తెలంగాణ రాష్ట్ర అభి అభివృద్ధికి ఎంతో కీలకం అని వ్యాఖ్యానించారు.
2047 పాలసీ డాక్యుమెంట్ రూపొందించినట్లు ప్రధానికి సీఎం వివరించారు. 5 రాష్ట్రాల ఎన్నికలు ముగియగానే అభివృద్ధి పనులు ముందుకు తీసుకెళ్లడానికి మోడీ వచ్చారని కొనియాడారు. 2047 నాటికి దేశ ఎకానమీని 30 ట్రిలియన్‌లకు చేర్చాలని ప్రధాని మోదీ లక్ష్యంగా పెట్టుకున్నారని.. 3 శాతం జనాభా ఉన్న తెలంగాణ దేశంలో 10 శాతం ఎకానమీని లక్ష్యంగా పెట్టుకుందని వెల్లడించారు. 2047 నాటికి తెలంగాణ 3 ట్రిలియన్ల ఎకానమీ చేరుకోవడమే తమ లక్ష్యం అని సీఎం రేవంత్ మరోసారి స్పష్టం చేశారు.

