Mobile Popup Ad
Mobile Popup Ad

హైదరాబాద్ లో పలు అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన

కలం, వెబ్ డెస్క్ :  ప్రధాని మోదీ (PM Modi ) తెలంగాణ పర్యటన కొనసాగుతోంది. హెచ్ఐసీసీ ప్రాంగణానికి చేరుకున్న ప్రధాని మోదీని సీఎం రేవంత్ రెడ్డి సత్కరించారు. ప్రధానికి రేవంత్ రెడ్డి వెండి నంది విగ్రహాన్ని బహుకరించారు. అనంతరం సుమారు రూ. 9,377 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని మోదీ వర్చువల్ గా శంకుస్థాపన చేశారు.

ఈ మేరకు హెచ్ఐసీసీ లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోదీ శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా కాకతీయ టెక్స్ టైల్ పార్క్ ను ప్రధాని మోదీ ప్రారంభించారు. కాజీపేటలో రైలు అండర్ రైలు బైపాస్ లేన్  పనులకు, గుడెబల్లూరు – మహబూబ్ నగర్ 4 లేన్ల రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అలాగే కాజీపేట – విజయవాడ మల్టీ ట్రాకింగ్ పనులను ప్రారంభించారు. మల్కాపూర్ లో ఐఓసీ గ్రీన్ ఫిల్డ్ టెర్మినల్ , జహీరాబాద్ ఇండస్ట్రీయల్ ఏరియా అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేాశారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>