Mobile Popup Ad
Mobile Popup Ad

గ‌వ‌ర్న‌ర్ శివ్‌ ప్ర‌తాప్‌ శుక్లా‌ను క‌లిసిన సీఎం రేవంత్

కలం, వెబ్ డెస్క్: తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ శివ్ ప్ర‌తాప్ శుక్లాను లోక్ భ‌వ‌న్‌లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth) మర్యాదపూర్వకంగా క‌లిశారు. జూన్ 12న పాఠ‌శాల పునఃప్రారంభం సంద‌ర్భంగా విద్యార్థుల‌తో నిర్వ‌హించే స‌భ‌కు గ‌వ‌ర్న‌ర్ ను సీఎం ఆహ్వానించారు. విద్యార్థులు పొగాకు, మద్యం, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని.. బాధ్యతగల పౌరులుగా ప్రవర్తించాలని సభలో సామూహిక ప్రతిజ్ఞ చేయించనుంది. మాద‌క ద్ర‌వ్యాల‌కు దూరంగా ఉంటామ‌ని విద్యార్థుల‌తో ప్రతిజ్ఞ చేయించాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి గ‌తంలో గ‌వ‌ర్న‌ర్ సూచించారు. గ‌వ‌ర్న‌ర్ సూచ‌నను గౌర‌విస్తూ ఈ మేరకు విద్యార్థుల‌తో భారీ సభ ఏర్పాటు చేసి ప్ర‌భుత్వం యాంటీ డ్ర‌గ్స్ ప్రతిజ్ఞ చేయించ‌నుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>