సీఎం రేవంత్‌కు సరస్వతి అంత్య పుష్కరాల ఆహ్వానం

కలం, వెబ్ డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth)కి సరస్వతి నది అంత్య పుష్కరాల ఆహ్వానం అందింది. ఈ మేరకు సీఎంకు కలిసి సరస్వతి అంత్య పుష్కరాలకు మంత్రి కొండా సురేఖ, శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థాన అర్చకులు ఆహ్వానించారు. ఈ నెల 21 నుంచి జూన్ 1 వరకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో సరస్వతి అంత్య పుష్కరాలు (Saraswati Anthya Pushkaralu) జరుగనున్నాయి. ఈ కార్యక్రమంలో ఎంపీ వేం నరేందర్ రెడ్డి, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్, కమిషనర్ హనుమంతరావు, శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానం ఈవో మహేష్, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.

కాళేశ్వరం పుణ్యక్షేత్రం వేదికగా మే 21 నుండి జూన్ 1 వరకు సరస్వతీ నది అంత్య పుష్కరాలను రాష్ట్ర ప్రభుత్వం వైభవంగా నిర్వహించనుంది. ఈ పుష్కరాలకు సుమారు 40 లక్షల మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని మంత్రులు కొండా సురేఖ, శ్రీధర్ బాబు తెలిపారు. ఇటీవల పుష్కరాల ఏర్పాట్లపై సచివాలయంలో సీఎం కె.రామకృష్ణారావు అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ మేరకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఘాట్ల వద్ద పారిశుధ్యం, తాగునీరు, విద్యుత్ సరఫరా, వైద్య శిబిరాలు, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని మంత్రులు ఆదేశించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>