Mobile Popup Ad
Mobile Popup Ad

హైదరాబాద్‎లో వలస నేపాలీలకు ఉపాధి సమస్యలు

కలం, వెబ్ డెస్క్: ఉపాధి కోసం హైదరాబాద్‎ నగరానికి వచ్చిన నేపాలీ దేశస్థులకు (Nepali Migrants) కొత్త సమస్యలు ఎదురవుతున్నాయి. ఇటీవల హైదరాబాద్‎ జూబ్లీహిల్స్‎లోని ప్రశాసన్ నగర్‎లో మాజీ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రే భార్యను దుండగులు కిరాతకంగా హత్య చేసి ఇంట్లోని నగదు, బంగారు ఆభరణాలతో పారిపోయారు. ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఇంట్లో పనిచేసే నేపాల్ దేశానికి చెందిన మహిళా మరో ఇద్దరితో కలిసి ఘాతుకానికి పాల్పడినట్లు నిర్ధారించారు. ఈ ఘటనను మారువకముందే హైదరాబాద్‎లోని జవహర్‎నగర్‎లో నేపాలీ ముఠా రెచ్చిపోయింది. వృద్ధ దంపతుల ఇంట్లోకి చొరబడిన నేపాలీ ముఠా దంపతులను బంధించి చోరికి పాల్పడ్డారు. దంపతుల కాళ్లు, చేతులు కట్టేసి బెదిరించి ఇంట్లోని బంగారు ఆభరణాలను, నగదును ఇతర విలువైన సామగ్రిని ఎత్తుకెళ్లారు. వాస్తవానికి ఇలాంటి ఘటనలు కొత్తేమీ కాదు. గతంలో కూడా నేపాలీ దేశానికి చెందిన ముఠాలు నగరంలో ఎన్నో దోపిడిలకు పాల్పడ్డారు. దీంతో హైదరాబాద్ ప్రజలు నేపాలీల పేరు వింటేనే ఆందోళన చెందుతున్నారు.

వరుస ఘటనలతో ఉపాధి ప్రశ్నార్థకం

హైదరాబాద్‎లోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్ తదితర ప్రాంతాల్లో నేపాలీలు ఇళ్లలలో పనిమనషులుగా చేరుతుంటారు. మరికొంతమంది హోటల్స్, రెస్టారెంట్స్ లలో పనులు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. సెలవులు తీసుకోకుండా తక్కువ వేతనాలకు ఎక్కువ పనిచేస్తారనే ఉద్దేశంతో యజమానులు కూడా వీరికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. ఇలా హైదరాబాద్ వచ్చి చిన్న చితకా పనులు చేస్తూ జీవనం కొనసాగిస్తున్న వారి సంఖ్య వెయ్యికి పైగానే ఉంటుంది. కానీ తాజా ఘటనలతో వారి పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. వరుసగా జరుగుతున్న ఘటనలలో నేపాలీల ప్రమేయం ఉండటంతో హైదరాబాద్ ప్రజలు వారికి పనులలో పెట్టుకోవలంటేనే ఒకటికి వందసార్లు ఆలోచిస్తున్నారు. ఎవరిని నమ్మలో ఎవరిని నమ్మకూడదో అర్థంకానీ పరిస్థితి నెలకొంది. అనేకమంది వారిని పనులలో పెట్టుకోవలంటేనే జంకుతున్నారు. ఒకవేళ నేపాలీలను పెట్టుకున్నా.. తాజా ఘటనల నేపథ్యంలో వారిని పనుల నుంచి తీసేస్తున్నారు.

నేపాలీలపై పోలీసుల నజర్..

నగరంలో నేపాలీల ఆగడలు పెరిగిపోతున్న నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలో నేపాలీ పనిమనుషులుగా ఉన్న ఇళ్లకు నోటీసులు జారీచేశారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గంలో ప్రముఖులు, ధనవంతుల ఇళ్లకు నోటీసులు అందించారు. మరోవైపు నేపాలీలపై పోలీసులు నిఘా పెంచారు. నగరంలో ఉంటున్న నేపాలీల వివరాలను సేకరిస్తున్నారు.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

1) పనులలో పెట్టుకునే ముందు వారి పూర్తి వివరాలు తీసుకోవాలి.
2) ఆధార్ కార్డు, ఫోన్ నంబర్, చిరునామా, ఫోటో తీసుకోవాలి.
3) వీలైతే వారి కుటుంబ సభ్యుల వివరాలు కూడా మీ వద్ద ఉంచుకోండి.
4) వారు చెప్పిన వివరాలను సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్లో వెరిఫికేషన్ చేయించాలి.
5) ఇంట్లో విలువైన వస్తువులు జాగ్రత్తగా ఉంచాలి.
6) నిరంతరం కదలికలపై నిఘా పెట్టండి.
7) అవసరం అయితే తప్ప వ్యక్తిగత, బ్యాంక్ వివరాలను ఇవ్వకండి.
8) సీసీ కెమెరాలు అమర్చాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>