సీఎం చంద్రబాబు అధ్యక్షతన నేడు టీడీపీ కీలక భేటీ

కలం, వెబ్ డెస్క్: సీఎం చంద్రబాబు అధ్యక్షతన గురువారం తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం (TDP Politburo Meeting) కానుంది. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు జరగనుంది. ప్రధాని పిలుపుమేరకు పొదుపు చర్యల్లో భాగంగా ఆన్‌లైన్‌లో ఈ సమావేశాన్ని నిర్వహించనున్నారు. రెండేళ్ల పాలనా విజయాలు ప్రజల్లోకి తీసుకెళ్లేలా సీఎం (CM Chandrababu) దిశానిర్దేశం చేయనున్నారు. అలానే ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు క్షేత్రస్థాయిలో ఇంటింటికీ వెళ్లేలా కార్యాచరణ రూపొందించారు. అలాగే పశ్చిమాసియా యుద్ధప్రభావం వల్ల రాష్ట్ర ఆర్థిక ఇబ్బందులపై ఈ భేటీలో చర్చించనున్నారు. మహానాడు నిర్వహణపై సైతం చర్చించనున్నట్లు సమాచారం. సీఎం చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసం నుంచి వర్చువల్ విధానంలో ఈ సమావేశం పాల్గొననున్నారు. సమావేశానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేశ్ తో పాటు పలువురు పొలిట్‌బ్యూరో సభ్యులు హాజరుకానున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>