కలం, వెబ్ డెస్క్: ఏపీలోని నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం తుమ్మలపెంట గ్రామంలో మంగళవారం నిర్వహించిన ‘మత్య్సకారుల సేవలో’ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ( CM Chandrababu) రూ.262 కోట్ల నిధులను విడుదల చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ.. మత్స్యకారులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచారు. చరిత్రలో తొలిసారి రూ.262 కోట్లు మత్స్యకారుల ఖాతాల్లో జమ చేసినట్లు వెల్లడించారు. మత్సకారుల కోసం రూ.3,256 కోట్లతో 9 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. ‘బోటూ మనదే.. వేటా మనదే’ అంటూ మత్సకారుల్లో సీఎం జోష్ నింపారు.
వరుసగా రెండో ఏడాది ‘మత్స్యకారుల సేవలో’ పథకం కింద నిధుల విడుదల చేయడంపై మత్య్సకార కుటుంబాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఈ తరుణంలో మత్స్యకారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కృష్ణానదిలో బోట్ల ప్రదర్శన నిర్వహించారు. తమ సంక్షేమం పట్ల కూటమి ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనంగా కృష్ణానదిలో బోట్ల ర్యాలీతో ప్రభుత్వానికి మద్దతు తెలియజేశారు వేట నిషేధ సమయంలో ఇబ్బంది పడకుండా ఒక్కో మత్స్యకార కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక భరోసాను రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. గతేడాది 1,21,433 కుటుంబాలకు రూ.243 కోట్ల సాయం అందజేసింది. తాజాగా ఇవాళ 1,30,796 మత్స్యకార కుటుంబాలకు రూ.262 కోట్ల ఆర్థిక సహాయం అందజేసింది. కాగా, రెండేళ్లలోనే ‘మత్స్యకారుల సేవలో’ పథకం ద్వారా రూ.505 కోట్ల సాయాన్ని కూటమి ప్రభుత్వం అందించింది.

