Mobile Popup Ad
Mobile Popup Ad

బనగానపల్లెకు సీఎం.. నేడు కొత్త పాస్ పుస్తకాల పంపిణీ!

కలం, వెబ్ డెస్క్ : నంద్యాల జిల్లా బనగానపల్లెలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu) నేడు పర్యటించనున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మీ భూమి-మీ హక్కు’ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ఈ సందర్భంగా ప్రభుత్వ రాజముద్రతో నూతనంగా రూపొందించిన కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను ముఖ్యమంత్రి చేతుల మీదుగా రైతులకు పంపిణీ చేయనున్నారు.

పాస్ పుస్తకాల పంపిణీ అనంతరం రైతులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu) ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. రైతుల సమస్యలు, భూ రికార్డుల ప్రక్షాళన, వ్యవసాయ రంగానికి సంబంధించిన పలు అంశాలపై వారితో నేరుగా చర్చించనున్నారు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు సీఎం చంద్రబాబు హాజరై ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో నంద్యాల జిల్లా యంత్రాంగం, బనగానపల్లె నియోజకవర్గ నేతలు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు.

Read Also: డిజిటల్ వారసులు

Read Also : అమెరికా వీసా రూల్స్ చేంజ్: ఎవరికి లాభం? ఎవరికి నష్టం?

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>