కలం, వెబ్ డెస్క్: ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడుకు (CM Chandrababu) నారావారిపల్లికి ప్రత్యేక అనుబంధం ఉంది. ప్రతి సంక్రాంతి పండుగను ఆయన కుటుంబసమేతంగా జరుపుకుంటారు. బిజీ షెడ్యూల్ పక్కన పెట్టి సభ్యులతో ఆనందంగా గడుపుతుంటారు. మూడో రోజు గురువారం సీఎం చంద్రబాబు నారావారిపల్లిలో పర్యటిస్తున్నారు. ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి తల్లిదండ్రులు, తమ్ముడు సమాధుల వద్ద చంద్రబాబు నివాళులు అర్పించారు. అనంతరం నారావారిపల్లిలో కొలువైన గ్రామదేవత నాగులమ్మ పుట్ట వద్ద ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో సీఎం మీడియా సమావేశంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ఉండవల్లికి తిరుగు ప్రయాణమవుతారు.
అలాగే ఏపీలో సంక్రాంతి (Sankranti) సంబురాలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రముఖులు, రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు వేడుకల్లో పాల్గొంటున్నారు. సంక్రాంతి సంబరాల్లో మంత్రి వాసంశెట్టి సుభాష్ డ్యాన్స్ చేసి అలరించాడు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలోని ఓ కాలేజీలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. వేదికపై స్టెప్పులేసి ప్రజలను ఉత్సాహపర్చాడు.


