కలం వెబ్ డెస్క్ : రాష్ట్రంలో ఎక్కడ చూసినా వీధి కుక్కల(Stray Dogs) బెడద తీవ్రంగా ఉంది. ఈ కుక్కల సమస్య గురించి గల్లీ నుంచి ఢిల్లీలోని సుప్రీం కోర్ట్ దాకా చర్చ నడుస్తోంది. కుక్కల దాడులను తట్టుకోలేక ఇటీవల పలు చోట్ల కొందరు వాటిని చంపేస్తున్నారు. ఇలాగే కామారెడ్డి(Kamareddy)లో కుక్కలను చంపేసిన పలువురు సర్పంచుల(Sarpanches)కు షాక్ తగిలింది. కామారెడ్డి(Kamareddy) జిల్లాలోని మాచారెడ్డి మండల పరిధిలో భవానిపేట, ఫరీద్ పేట, వాడి, పాల్వంచ, బండ రామేశ్వర్‌పల్లి గ్రామాల్లో సర్పంచులు కుక్కలను చంపించారు. దీంతో వారిపై యానిమల్ యాక్ట్ కింద కేసులు నమోదయ్యాయి. ఈ ఐదు గ్రామాల్లో సుమారు 600 కుక్కలకు విషం పెట్టి చంపినట్లు సమాచారం. ఐదుగురు సర్పంచ్‌లపై బీఎన్ఎస్ 325 కింద మాచారెడ్డి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. వీరికి ఐదేళ్లు జైలు శిక్ష లేదా భారీ జరిమానా లేదా రెండు శిక్షలు విధించే అవకాశం ఉంది.


