గోదావరిఖనిలో రౌడీషీటర్లకు సీపీ హెచ్చరిక

కలం, రామగుండం: రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి జోన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ, అసాంఘిక కార్యకలాపాల నియంత్రణలో భాగంగా గోదావరిఖని (Godavarikhani) వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 16 మంది రౌడీషీటర్లను గురువారం బైండోవర్ చేశారు. వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఆధ్వర్యంలో వారిని రామగుండం పోలీస్ కమిషనర్, అదనపు జిల్లా మెజిస్ట్రేట్ (ఎగ్జిక్యూటివ్) అంబర్ కిషోర్ ఝా ఎదుట హాజరుపరిచారు. బీఎన్‌ఎస్‌ఎస్ సెక్షన్లు 126 నుంచి 136 ప్రకారం విచారణ నిర్వహించారు. ఏడాది పాటు సత్ప్రవర్తనతో ఉంటామని హామీ ఇస్తూ ఒక్కొక్కరి నుంచి రూ.లక్ష పూచీకత్తుతో బాండ్లు తీసుకున్నారు.

ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా మాట్లాడుతూ.. బైండోవర్ నిబంధనలను ఉల్లంఘించి తిరిగి నేరాలకు పాల్పడినా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా పూచీకత్తు సొమ్మును జప్తు చేయడంతో పాటు చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అవసరమైతే జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉందని తెలిపారు. నేరప్రవృత్తి కలిగిన వ్యక్తులపై నిరంతర నిఘా కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

బైండోవర్ అయిన 16 మంది రౌడీషీటర్ల వివరాలు:
  1. ఆకుల తిరుపతి: తండ్రి రాజేశం, విఠల్‌నగర్, గోదావరిఖని.
  2. భీమా శ్రీకాంత్: తండ్రి వీరయ్య, గాంధీనగర్, గోదావరిఖని.
  3. అన్నవేణి సాయితేజ: తండ్రి నారాయణ, సుందిళ్ల గ్రామం; ప్రస్తుతం రాంనగర్, గోదావరిఖని.
  4. చీమల శ్రీధర్: తండ్రి గురువయ్య, ప్రశాంతినగర్, గోదావరిఖని.
  5. కొమ్ము ప్రసాద్: తండ్రి జీవరత్నం, లెనిన్‌నగర్, గోదావరిఖని.
  6. కొమురవెల్లి విశ్వనాథ్: తండ్రి భాస్కర్, బాపూజీనగర్, గోదావరిఖని.
  7. మేకల నాంపల్లి: తండ్రి రాజయ్య, ఉదయ్‌నగర్, గోదావరిఖని.
  8. గడ్డం సతీష్: తండ్రి ధర్మయ్య, విఠల్‌నగర్, గోదావరిఖని.
  9. బొబ్బల మహేష్: తండ్రి రాయమల్లు, తిలక్‌నగర్, గోదావరిఖని.
  10. అడ్లూరి శ్రవణ్ కుమార్: తండ్రి పోశం, ఐబీ కాలనీ, గోదావరిఖని.
  11. అవునూరి సురేష్: తండ్రి సైలూ, తిలక్‌నగర్, గోదావరిఖని.
  12. నల్లంగుల ప్రసాద్: తండ్రి సదయ్య, విఠల్‌నగర్, గోదావరిఖని.
  13. పొరండ్ల సతీష్ బాబు: తండ్రి లింగయ్య, చంద్రశేఖర్‌నగర్, గోదావరిఖని.
  14. జటోత్ సర్వేష్: తండ్రి మంగ్యా, ఎల్‌బీనగర్, గోదావరిఖని.
  15. మహమ్మద్ జాకీర్: తండ్రి జమాల్, హనుమాన్‌నగర్, గోదావరిఖని.
  16. బొల్లి రమేష్: తండ్రి ఓదేలు, ఎల్‌బీనగర్, గోదావరిఖని.

ఈ కార్యక్రమంలో గోదావరిఖని ఏసీపీ ఎం. రమేష్, ప్రొబేషనరీ డీఎస్పీలు సీహెచ్. ఆదిశేషు రెడ్డి, మహమ్మద్ తాజుద్దీన్, బి. ఐశ్వర్య, దుగ్గిరెడ్డి హరిప్రియ, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, సీసీఆర్బీ ఇన్‌స్పెక్టర్ లక్ష్మీనారాయణ, గోదావరిఖని వన్‌టౌన్ ఇన్‌చార్జి ఇన్‌స్పెక్టర్ లింగమూర్తి, ఆర్‌ఐ రమేష్, ఎస్సైలు మనోహర్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>