కలం, కరీంనగర్ బ్యూరో: బీజేపీ కరీంనగర్ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా రాపాక ప్రవీణ్ (Rapaka Praveen) నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు అధికారిక నియామక ఉత్తర్వులు జారీ చేశారు. రాపాక ప్రవీణ్ మానకొండూరు మండలం లక్ష్మీపూర్ ఉప సర్పంచిగా పనిచేస్తున్నారు. గతంలో మానకొండూర్ మండల పార్టీ అధ్యక్షుడిగా పని చేశారు.
సెంట్రల్ ఫిలిం సెన్సార్ బోర్డ్ అడ్వైజరీ ప్యానెల్ మెంబర్ హోదాలో కొనసాగుతున్నారు. ఎస్సీ వర్గాల సమస్యల పరిష్కారంతో పాటు జిల్లాలో ఎస్సీ మోర్చా విభాగం మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తానని రాపాక ప్రవీణ్ (Rapaka Praveen) తెలిపారు. తన నియామకానికి సహకరించిన కేంద్ర మంత్రి బండి సంజయ్, జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, బీజేపీ నాయకులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్టు చెప్పారు.
Read Also: రైతులకు సోలార్ ‘పంట’.. త్వరలో పైలట్ ప్రాజెక్టు ప్రారంభం
Follow Us On : WhatsApp

