కలం, నిర్మల్ : నిర్మల్ జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ప్రజావాణి కార్యక్రమంలో స్వీకరించిన ఫిర్యాదులపై తీసుకుంటున్న చర్యలు, పెండింగ్లో ఉన్న పిటిషన్ల పురోగతిని జిల్లా ఎస్పీ జానకి షర్మిల (Nirmal SP Janaki Sharmila) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శుక్రవారం సమీక్షించారు.
ఈ సందర్భంగా ఎస్పీ (Nirmal SP) మాట్లాడుతూ.. ప్రజల నుంచి స్వీకరించిన ప్రతి ఫిర్యాదును అత్యంత ప్రాధాన్యతతో పరిశీలించి, సత్వర పరిష్కారానికి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఎక్కువ కాలంగా పెండింగ్లో ఉన్న పిటిషన్లను ప్రత్యేకంగా సమీక్షించి, వాటి విచారణను వేగవంతం చేయాలని సూచించారు.
ప్రతి ప్రజావాణి పిటిషన్పై ఎప్పటికప్పుడు ఫాలోఅప్ నిర్వహించి, బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని, ఫిర్యాదుల పరిష్కారంలో ఎలాంటి జాప్యానికి తావు లేకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారంలో ప్రజావాణి కార్యక్రమం కీలకమని, ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
Read Also: రైతులకు సోలార్ ‘పంట’.. త్వరలో పైలట్ ప్రాజెక్టు ప్రారంభం
Follow Us On: Instagram

