Mobile Popup Ad
Mobile Popup Ad

డ్రగ్స్‌ అనర్థాలపై కరీంనగర్‌లో అవగాహన

కలం, కరీంనగర్ బ్యూరో: అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా కరీంనగర్ (Karimnagar) డీవైఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం బస్టాండ్ ఆవరణలో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రయాణికులకు డ్రగ్స్ వినియోగం వలన కలిగే అనర్థాలపై అవగాహన కల్పిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి డి.నరేష్ పటేల్ (Naresh Patel) మాట్లాడుతూ.. దేశంలో డ్రగ్స్ వినియోగం ఆందోళనకర స్థాయికి చేరుకుందన్నారు. యువతను లక్ష్యంగా చేసుకుని డ్రగ్స్ మాఫియా విస్తరిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. మాదక ద్రవ్యాల వినియోగం వల్ల యువత శారీరక, మానసిక ఆరోగ్యంతో పాటు వారి భవిష్యత్తు కూడా నాశనం అవుతోందన్నారు.

నిరుద్యోగం కూడా కారణం..

దేశంలో నిరుద్యోగ సమస్య, యువతకు తగిన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేకపోవడం కూడా కొంతమంది యువత చెడు అలవాట్ల వైపు మళ్లడానికి కారణమవుతోందని నరేష్ పటేల్ పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు క్రీడా, సాంస్కృతిక రంగాలను ప్రోత్సహించాలని డిమాండ్ చేశారు. విద్యాసంస్థల పరిసర ప్రాంతాల్లో డ్రగ్స్ విక్రయాలు జరుగకుండా పోలీసు, ఎక్సైజ్ శాఖలు నిరంతరం నిఘా ఏర్పాటు చేయాలని కోరారు. విద్యాసంస్థల్లో డ్రగ్స్ వ్యతిరేక అవగాహన కమిటీలను ఏర్పాటు చేసి విద్యార్థుల్లో చైతన్యం కల్పించాలని సూచించారు.

సినిమాలు, సోషల్ మీడియా వేదికల ద్వారా మాదక ద్రవ్యాలను గ్లామరైజ్ చేసే ధోరణిని అరికట్టాలని, యువతలో సామాజిక బాధ్యత పెంపొందించే కార్యక్రమాలను చేపట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి జిల్లాలో డీ-అడిక్షన్ (వ్యసన విముక్తి) కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా (Karimnagar) ఉపాధ్యక్షులు శివ కుమార్, కృష్టా, నాయకులు దినేష్, కౌశిక్, ప్రసాద్, నాగరాజు, మురళి, చిన్ను, జీవన్, సాయి పాల్గొన్నారు.

Read Also: దిక్కు లేని వృద్ధ కళాకారుడు.. అండగా నిలిచినా ఆనంద్ మహీంద్రా

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>