కలం, వెబ్ డెస్క్ : ఏపీలో ఏప్రిల్ 1 నుంచి ఆరోగ్య శ్రీ సేవలు (AP Aarogyasri) నిలిచిపోయనున్నాయి. ఈ మేరకు బకాయిలు చెల్లించకపోవడంతో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ (ఆశ) ప్రకటన విడుదల చేసింది. ఆరోగ్యశ్రీ ఆసుపత్రులకు ప్రభుత్వం రూ.3 వేల కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉంది. బకాయిల కోసం ప్రభుత్వం చుట్టూ ఎన్నిసార్లు తిరిగిన ప్రయోజనం లేకుండా పోయిందని.. అందుకే ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేస్తున్నట్లు ఆశ వెల్లడించింది. బకాయిలు చెల్లిస్తేనే ఆరోగ్యశ్రీ సేవలను కొనసాగిస్తామని అల్టిమేటం జారీ చేసింది.
కాగా, పెండింగ్ ఉన్న బకాయిలు ఇవ్వకపోతే ఆరోగ్య శ్రీని ఆపేస్తామని గతంలోనూ ప్రభుత్వానికి ఆశ అల్టిమేటం జారీ చేసింది. 2025లో కనీసం మూడు ప్రధాన సందర్భాల్లో ఈ ప్రకటనలు జరిగాయి. పెండింగ్‌లో ఉన్న బకాయిలను వెంటనే విడుదల చేయకపోతే ఈ స్కీమ్‌లో భాగస్వామ్యం కాబోమని తేల్చింది. పెండింగ్ బకాయిలు చెల్లించకపోతే ప్రజలకు ఆరోగ్య శ్రీ సేవలు (AP Aarogyasri Services) అందించడంలో తీవ్ర ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ఏప్రిల్ 1 నుంచి ఆరోగ్య శ్రీ బంద్ కు ఆశ పిలుపునిచ్చిన వేళ కూటమి ప్రభుత్వం పెండింగ్ బకాయిలు చెల్లిస్తుందా? ఏదైన సంప్రదింపులు చేస్తుందా? అనేది తెలియాల్సి ఉంది.
Read Also: నియోజకవర్గాల పునర్విభజనపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Follow Us On : WhatsApp

