కావాలనే రాష్ట్రంలో ఆందోళనలు సృష్టిస్తున్నారు : ఎంపీ సీఎం రమేశ్

కలం, వెబ్ డెస్క్ : వైఎస్ఆర్సీపీ (YSRCP) పార్టీపై బీజేపీ ఎంపీ సీఏం రమేష్ (MP CM Ramesh) మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు  కావాలనే ఆందోళనలు సృష్టిస్తున్నారని తెలిపారు. మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సూచనల మేరకే అంబటి రాంబాబు, పేర్ని నాని, జోగి రమేష్ లాంటి వారు రెచ్చిపోతున్నారు. రాష్ట్రం అభివృద్దిలో దూసుకుపోతుంది. కూటమి ప్రభుత్వ చలువతో రాష్ట్రంలో పండుగ వాతావరణం నెలకొంది. దానిని పాడు చేయాలని చూస్తున్నారు.

అనుచిత వ్యాఖ్యలతో ప్రజలను, కార్యకర్తలను రెచ్చగొడుతున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం కలిగించి ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలని.. మాజీ మంత్రులకు జగన్ నుంచి స్ట్రిక్ట్ ఆర్డర్స్ వచ్చాయని సీఎం రమేశ్ (MP CM Ramesh) తెలిపారు. అనవసరపు వ్యాఖ్యాలు చేస్తే ఈ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు.  ఎంతటి నాయకుడు  అయినా తప్పు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

 Read Also: పోలీసులు నిష్ప‌క్ష‌పాతంగా వ్య‌వ‌హ‌రించాలి : సీఎం చంద్ర‌బాబు

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>