రాష్ట్రంలో వైసీపీని బ‌హిష్క‌రించాలి : గంటా శ్రీనివాస రావు

క‌లం, వెబ్ డెస్క్‌: స‌మాజంలో వైసీపీలాంటి రాజ‌కీయ‌ పార్టీ ఉండాల్సిన అవ‌స‌రం లేద‌ని, ఆ పార్టీని బ‌హిష్క‌రించాల‌ని ఎమ్మెల్యే గంటా శ్రీనివాస (Ganta Srinivasa Rao) రావు అన్నారు. రాష్ట్రంలో వైసీపీ(YSRCP) నేత‌లు హ‌ద్దులు మీరి మాట్లాడుతున్నార‌ని గంటా మండిప‌డ్డారు. ఆవు చేలో మేస్తే దూడ గ‌ట్టున మేస్తుందా అన్న‌ట్లు వైసీపీ అధ్య‌క్షుడు జ‌గ‌న్ (YS Jagan) మాట్లాడిన మాట‌లు విన్న త‌ర్వాత ఆ పార్టీ నేత‌ల మాట‌ల‌ గురించి చెప్పుకోవాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. వైసీపీ నేత‌లు చివ‌ర‌కు ఇప్పుడు వ్య‌క్తి త‌ప్పు చేస్తే దాన్ని వ‌ర్గం మీద దాడిగా మారుస్తున్నార‌ని, వైసీపీ దిగ‌జారుడు రాజ‌కీయాలు చేస్తోంద‌ని విమ‌ర్శించారు.

రాజ‌కీయాల్లో విమ‌ర్శ‌లు, ప్ర‌తివిమ‌ర్శ‌లు ఉంటాయ‌ని గంటా అన్నారు. ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌పై అంద‌రూ మాట్లాడ‌తార‌ని, ఘాటు విమ‌ర్శ‌లు కూడా చేస్తార‌ని తెలిపారు. కానీ, వైసీపీ నాయ‌కుల‌లాగా మాట‌లు ఎవ‌రూ మాట్లాడ‌ర‌ని చెప్పారు. వైసీపీని బ్యాన్ చేస్తే త‌ప్ప ఇలాంటి వాటికి ప‌రిష్కారం ఉండ‌ద‌న్నారు. దీనిపై ఎన్నిక‌ల సంఘానికి కూడా ఓ లేఖ రాయ‌నున్న‌ట్లు గంటా శ్రీనివాస రావు (Ganta Srinivasa Rao) తెలిపారు.

 Read Also: కావాలనే రాష్ట్రంలో ఆందోళనలు సృష్టిస్తున్నారు : ఎంపీ సీఎం రమేశ్

Follow Us On: Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>