కలం, వెబ్ డెస్క్ : ఫోన్ ట్యాపింగ్ కేసులో (Phone Tapping Case) మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సిట్ విచారణపై జాగృతి అధ్యక్షురాలు కవిత (Kavitha) కీలక వ్యాఖ్యలు చేశారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదు.. విచారణకు సహకరించాల్సిందేనని ఆమె స్పష్టం చేశారు. సోమవారం కవిత మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ సిట్ విచారణపై బీఆర్ఎస్ నేతలు అనవసర రాద్దాంతం చేశారని తప్పుబట్టారు. ‘కేసీఆర్ (KCR) ను సిట్ విచారణకు ఎలా పిలుస్తారు?’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా వారి ఆలోచనలో మార్పు రావాలని లేకపోతే ఆ పార్టీని ఎవరూ బాగుచేయలేరని ఎద్దేవా చేశారు. చట్టం ముందు అందరూ సమానులేనని.. తనని కూడా సిట్ పిలిస్తే విచారణకు హాజరవుతానని కవిత స్పష్టం చేశారు.
కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి మొండి చేయి చూపించారని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంతో సఖ్యంగా ఉంటున్నాం.. ప్రధాని తమకు పెద్దన్న అని చెబుతున్న సీఎం రేవంత్ రెడ్డి బడ్జెట్ లో రాష్ట్రానికి కేటాయింపులు తీసుకురావడంలో విఫలమయ్యారని విమర్శించారు. 30 సార్లకు పైగా ఢిల్లీకి వెళ్లిన రేవంత్ రెడ్డి తెలంగాణకు రూ.30 వేల కోట్లు కూడా తేలేకపోయారని ఎద్దేవా చేశారు. రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇద్దరు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కేంద్రం నుండి నిధులు రాబాట్టాలని కవిత (Kavitha) డిమాండ్ చేశారు.
Read Also: సిట్ చీఫ్ సజ్జనార్‌పై హరీశ్ రావు ఫైర్
Follow Us On: Pinterest


