బెంగాల్​ ఫలితాలపై చంద్రబాబు రియాక్షన్​ ఇదే!

కలం, వెబ్‌డెస్క్: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్‌డీఏ (NDA) విజయం.. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ (PM Narendra Modi) నాయకత్వంపై, వికసిత భారత్ దిశగా ఆయన దృష్టిపై ప్రజల నిరంతర, పెరుగుతున్న విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుందని సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu) అన్నారు. “సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్” అనే భావనతో నడిచే ఎన్‌డీఏ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు సంగమంగా నిలుస్తుందని, ఈ విజయం ప్రజల ఆకాంక్షలను మరింత బలపరుస్తోందని అన్నారు. ఈ ఎన్నికల ఫలితంతో వికసిత భారత్ వైపు ప్రయాణం మరింత దృఢమైందని ఆశాభావం వ్యక్తం చేశారు.

అభివృద్ధి పట్ల ఎన్‌డీఏ ప్రభుత్వం యొక్క అచంచల నిబద్ధతకు ప్రజలు చూపిన నమ్మకం, మద్దతు స్పష్టంగా కనిపిస్తోందని కొనియాడారు. అలాగే, యువ భారత్ విశ్వసనీయత, అభివృద్ధి, ప్రజలతో నిజమైన అనుబంధాన్ని ఎంత విలువగా భావిస్తుందో అన్ని రాజకీయ పార్టీలకు ఇది ఒక సందేశంగా నిలుస్తోందని స్పష్టం చేశారు. ఈ చారిత్రాత్మక విజయానికి గాను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్‌కు, ఎన్‌డీఏ విజేతలందరికీ, అంకితభావంతో పనిచేసిన కార్యకర్తలకు, అలాగే ప్రజలందరికీ సీఎం చంద్రబాబు (CM Chandrababu) హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.

Read Also: తమిళనాడులో హంగ్ వస్తే​.. కింగ్ మేకర్‌గా విజయ్?

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>