త్రిష బర్త్‌డే.. విశ్వంభర స్పెషల్ పోస్టర్ రిలీజ్

కలం, సినిమా : మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా, యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ వశిష్ట (Vassishta) తెరకెక్కిస్తున్న బిగ్గెస్ట్ సోషియో ఫాంటసీ మూవీ ‘విశ్వంభర’ (Vishwambhara). గత కొంతకాలంగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా నుంచి స్పెషల్ అప్డేట్ వచ్చింది. నేడు (మే 4) క్యూట్ బ్యూటీ త్రిష (Trisha) పుట్టినరోజు సందర్భంగా.. బర్త్‌డే విషెస్ తెలియజేస్తూ మేకర్స్ ఈ సినిమా నుంచి కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సినిమాలో త్రిష మెగాస్టార్ సరసన హీరోయిన్‌గా నటిస్తుంది.

తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్‌లో త్రిష (Trisha) ఎంతో గ్రేస్‌ఫుల్‌గా కనిపిస్తూ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ చిత్రంలో ఆమె ‘అవని’ అనే కీలక పాత్రలో నటిస్తున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. చిరంజీవి-త్రిష కాంబినేషన్‌లో మళ్లీ సినిమా రావడంతో విశ్వంభర సినిమాపై ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గత కొంత కాలంగా విడుదల వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్‌ని మేకర్స్ త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.

Read Also: ఫస్ట్ ఇంప్రెషన్‌ను పాడుచేసే అలవాట్లు ఏంటో తెలుసా?

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>