న‌ర్సాపూర్‌లో ఉద్రిక్త‌త‌.. త‌న్నుకున్న‌ బీజేపీ, బీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌లు

కలం, మెదక్ బ్యూరో: మున్సిప‌ల్ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఉమ్మ‌డి మెద‌క్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీ (Narsapur Municipality)లో తీవ్ర ఉద్రిక్త‌త చోటు చేసుకుంది. రాజ‌కీయ కార‌ణాల‌తో 15వ వార్డులో బీజేపీ (BJP), బీఆర్ఎస్ (BRS) కార్య‌క‌ర్త‌ల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ త‌లెత్తింది. దీంతో ఆయా పార్టీల నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు చొక్కాలు పట్టుకుని కొట్టుకున్నారు. రోడ్డుపైనే పిడిగుద్దులు గుద్దుకుంటూ త‌న్నుకున్నారు. పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకొని ఇరు వ‌ర్గాల‌ను చెద‌ర‌గొట్టారు. ఈ ఘ‌ర్ష‌ణ‌కు గ‌ల కార‌ణాలు తెలియాల్సి ఉంది. ఈ గొడ‌వ‌లో ఇరు పార్టీల‌కు చెందిన ప‌లువురు కార్య‌క‌ర్త‌లు గాయాల‌పాల‌య్యారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>