Mobile Popup Ad
Mobile Popup Ad

ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం రేవంత్

కలం, వెబ్​ డెస్క్​ : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ రాష్ట్రవ్యాప్తంగా ఉత్సాహంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) తన సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొడంగల్‌లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి చేరుకున్న ఆయన క్యూలైన్‌లో నిలబడి తన ఓటు వేశారు.

అలాగే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మధిర మున్సిపాలిటీ పరిధిలో ఓటు వేశారు. అక్కడి ఇందిరా డెయిరీ పోలింగ్ కేంద్రంలో ఆయన తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే మంచిర్యాల జిల్లాలో మంత్రి వివేక్ ఓటు వేశారు. జిల్లాలోని హైటెక్ సిటీలో గల 227వ బూత్‌లో ఆయన తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>