epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

తొలి రోజు 17 కేసులు విచారించిన నూతన సీజేఐ

భారతదేశ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసిన తొలి రోజే 17 కేసులను విచారించారు జస్టిస్ సూర్యకాంత్(CJI Surya Kant). సుప్రీంకోర్టు 53వ సేజేఐగా ఆయన సోమవారం ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకారం చేశారు. ఆదివారంతో 52వ సీజేఐ బీఆర్ గవాయ్(BR Gvai) పదవీ కాలం పూర్తి కావడంతో.. సోమవారం నూతన సీజేఐ ప్రమాణ స్వీకారం కార్యక్రమం జరిగింది. తొలి రోజు 17 కేసులు విచారించడంతో పాటు సరికొత్త విధానపరమైన నిర్ణయాన్ని సీజేఐ సూర్యకాంత్ తీసుకొచ్చారు. ఇకపై అర్జెంట్ లిస్టింగ్ కేసులను తప్పనిసరిగా లిఖితపూర్వకంగా సమర్పించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. మరణశిక్ష, వ్యక్తిగత స్వేచ్ఛకు విఘాతం వంటి అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే మౌఖిక అభ్యర్థనలను అనుమతించనున్నట్లు వెల్లడించారు.

రాష్ట్రపతి భవన్‌లో ప్రమాణ స్వీకారం అనంతరం జస్టిస్‌ సూర్యకాంత్‌(CJI Surya Kant) సుప్రీం కోర్టుకు చేరుకున్నారు. న్యాయస్థానం ప్రాంగణంలో గాంధీ, బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహాలకు నివాళులు అర్పించారు. అనంతరం ఒకటో నంబర్‌ కోర్టు రూమ్‌లో జస్టిస్‌ జోయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్‌ అతుల్‌ ఎస్‌. చందూర్కర్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనానికి ఆయన నేతృత్వం వహించారు. ఓ ప్రైవేటు సంస్థకు వ్యతిరేకంగా హిమాచల్ ప్రదేశ్ దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పు ప్రకటించారు. ఆయన ఆధ్వర్యంలోని ధర్మాసనం రెండు గంటల్లో దాదాపు 17 కేసులు విచారించింది.

Read Also: సర్పంచ్ ఎన్నికలపై సీఎం రేవంత్ అప్‌డేట్

Follow Us on: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>