epaper
Monday, March 2, 2026
epaper

గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడి ఆస్తులు అటాచ్..

పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడు మధుసూదన్‌రెడ్డికి చెందిన పలు ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డిపార్ట్‌మెంట్(ED) అటాచ్ చేసింది. మధుసూదన్ రెడ్డి(Gudem Madhusudhan Reddy)కి చెందిన సంతోష్ శాండ్ అండ్ గ్రానైట్ కంపెనీ రూ. 300 కోట్ల అక్రమాలు చేసిందని, దాంతో పాటుగా ప్రభుత్వానికి మధుసూదన్ రెడ్డి రూ. 39కోట్ల రాయల్టీ కూడా చెల్లించలేదని ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఈడీ రంగంలోకి దిగి విచారణ చేపట్టింది. 2024 జూన్ నెలలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి(Gudem Mahipal Reddy), అతని సోదరుడు మధుసూదన్ రెడ్డి నివాసాలతో పాటు మరో 10 ప్రాంతాల్లో ED సోదాలు జరిపింది. ఈ సోదాల్లో రూ.19 లక్షల నగదుతో పాటు, పలు కీలక పత్రాను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసువిచారణలో భాగంగానే తాజాగా మధుసూదన్ రెడ్డికి చెందిన రూ.80 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ ఎటాచ్ చేసింది.

Read Also: సర్పంచ్ ఎన్నికలపై సీఎం రేవంత్ అప్‌డేట్

Follow Us on: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!