కలం, వలిగొండ: వలిగొండ (Valigonda) మండల కేంద్రంలో మంగళవారం మధ్యాహ్నం సివిల్ సప్లై (Civil Supplies) అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ దాడుల్లో అక్రమంగా నిల్వ చేయబడిన 15 డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు సీజ్ చేయబడ్డాయి. పట్టుబడిన సిలిండర్లను వెంటనే స్థానిక గ్యాస్ ఏజెన్సీకి తరలించారు. ఈ దాడిలో సివిల్ సప్లై జిల్లా అధికారిణి రోజారమణి, డివిజన్ అధికారిణి బాలమణి ప్రత్యక్షంగా పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ.. డొమెస్టిక్ సిలిండర్లను అక్రమంగా నిల్వ ఉంచినట్లయితే పట్టుకొని సీజ్ చేయడం జరుగుతుందని, కేసులు కూడా నమోదు చేస్తామని తెలిపారు.
Read Also: భారతదేశంలో ఎవరి మతం వాళ్లకు ఉంటుంది: వాకిటి శ్రీహరి
Follow Us On: Instagram

