కలం, నిర్మల్ : కేంద్ర కనీస వేతనాల సలహా మండలిలో సీఐటీయూతో పాటు ప్రధాన కేంద్ర కార్మిక సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించాలని కోరుతూ నిర్మల్ జిల్లా కేంద్రంలో సీఐటీయూ (CITU) కమిటీ ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయం ఎదుట సోమవారం నిరసన ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి సురేష్ మాట్లాడుతూ.. కార్మిక హక్కులు, కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత, కనీస సౌకర్యాల కోసం నిరంతరం పోరాడుతున్న సీఐటీయూకు కనీస వేతనాల సలహా మండలిలో ప్రాతినిధ్యం కల్పించకపోవడం అన్యాయమన్నారు. కార్మిక సంఘాలతో త్రైపాక్షిక చర్చలకు అవకాశం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు గంగాధర్, క్లైమెంట్ వెస్లీ, నారాయణ, పోశెట్టి, లక్ష్మి, రవి, రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

