కలం, స్పోర్ట్స్ : 140 కేజీల డెడ్‌లిఫ్ట్‌తో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో సిల్వర్ గెలిచిన భారత పవర్ లిఫ్టర్ కీయా కునాల్ బెనర్జీ (Keeya Kunal Banerjee) కి అనుకోని చేదు అనుభవం ఎదురైంది. ఆమె ప్రదర్శన వైరల్ కావడంతో ఫేక్ అకౌంట్లు, వేధింపులు మొదలయ్యాయి. ఆమె ఫొటోలతో వేలాది ఏఐ మార్ఫింగ్ చిత్రాలు తయారయ్యాయని కీయా వెల్లడించింది. దక్షిణాఫ్రికాలో జరిగిన 2026 ఐపీఎఫ్ వరల్డ్ సబ్-జూనియర్, జూనియర్ క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో కీయా పోటీ పడింది. 47 కేజీల విభాగంలో ఆమె 45.70 కేజీల బరువుతో బరిలోకి దిగింది.
డెడ్‌లిఫ్ట్‌లో 140 కేజీలు లేపింది. అంటే తన శరీర బరువుకు మూడు రెట్లకుపైగా బరువు. దీంతో డెడ్‌లిఫ్ట్ విభాగంలో సిల్వర్ సాధించింది. మొత్తం 280 కేజీలతో తన విభాగంలో ఐదో స్థానంలో నిలిచింది. ఈ ప్రదర్శనతో కీయా (Keeya Banerjee) పేరు సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ప్రశంసలతో పాటు వేధింపులు కూడా మొదలయ్యాయి. ఆమె ఫొటోలను దుర్వినియోగం చేశారు. ఫేక్ అకౌంట్లు తెరిచారు. ఏఐతో మార్ఫింగ్ చేసిన వేలాది చిత్రాలు సృష్టించారు.
ఆన్‌లైన్‌లో తన ఆట కంటే తన రూపంపైనే ఎక్కువగా చర్చ జరిగిందని కీయా తెలిపింది. ఇది మహిళా క్రీడాకారులు ఎదుర్కొంటున్న లింగ వివక్షకు ఉదాహరణగా ఆమె అభివర్ణించింది. అయితే ఈ పరిణామాలు తన ప్రపంచ ఛాంపియన్‌షిప్ విజయాన్ని మరిపించకూడదని కీయా భావిస్తోంది. రెండేళ్లుగా ఈ స్థాయి కోసం కష్టపడుతున్నట్లు తెలిపింది.
140 కేజీల లిఫ్ట్ కూడా తనకు అత్యుత్తమ పరిమితి కాదని ఆమె పేర్కొంది. శిక్షణలో 147.5, 150 కేజీల వరకు లేపినట్లు తెలిపింది. 147.5 కేజీలు ఆసియా రికార్డు కావడంతో పోటీలో దాన్ని బద్దలు కొట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించింది. ప్రస్తుతం కీయా దృష్టి మాత్రం పవర్ లిఫ్టింగ్‌పైనే ఉంది. భవిష్యత్తులో ప్రపంచ ఛాంపియన్‌షిప్ గోల్డ్ సాధించి భారత్‌కు తీసుకురావాలన్నది ఆమె లక్ష్యం.
Also Read : అరోనియన్‌ను చిత్తు చేసిన నిహాల్ సరీన్!
Follow Us On : WhatsApp

