కలం, నిర్మల్: గ్రామపంచాయతీ కార్మికుల (Panchayat Workers) సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ వర్కర్స్ యూనియన్ (CITU) ఆధ్వర్యంలో సోమవారం నిర్మల్ జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి సురేష్ మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ గ్రామపంచాయతీ కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయడంతో పాటు గ్రామపంచాయతీ కార్మికులకు (Panchayat Workers) కనీస వేతనం రూ.26 వేలు అమలు చేయాలని కోరారు. ప్రతి నెలా ఒకటో తేదీన కార్మికులకు వేతనాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించి, వారికి న్యాయం చేయాలని కోరారు. అనంతరం సీఐటీయూ నాయకులు నిర్మల్ జిల్లా కలెక్టరేట్‌లో ఇంచార్జి అదనపు కలెక్టర్‌ను కలిసి తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు.
Also Read : ఆసియా గేమ్స్: పోరాడి రజతం గెలిచిన ఈషా సింగ్!
Follow Us On: Instagram

