కలం, వెబ్ డెస్క్: బెట్టింగ్ యాప్స్ (Betting App Case) ప్రమోషన్ కేసులో సీఐడీ అధికారులు దూకుడు పెంచారు. ఈ కేసులో బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేసిన సోషల్ మీడియా ఇన్ ఫ్ల్యూయెన్సర్లు, నటులు, ప్రముఖులను సిట్ విచారిస్తోంది. ఇవాళ మంచు లక్ష్మి(Manchu Lakshmi), భయ్యా సన్నీ యాదవ్(Bayya Sunny Yadav), బిగ్‌బాస్ కంటెస్టెంట్ రీతు చౌదరిలను సీఐడీ అధికారులు విచారించారు. రెండు గంటలకు పైగా వీరిని ప్రశ్నించి స్టేట్‌మెంట్ రికార్డు చేశారు. ఇదే కేసులో ఇప్పటికే హీరోయిన్ నిధి అగర్వాల్, యాంకర్ శ్రీముఖి, నటి అమృత చౌదరి కూడా సీఐడీ అధికారుల విచారణకు గతంలో హాజరై వివరణ ఇచ్చారు. దాదాపు రెండు గంటలకు పైగా అధికారులు వీరిద్దరినీ విడివిడిగా.. మరోసారి కలిపి ప్రశ్నించినట్లు సమాచారం.
ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కోసం జరిగిన లావాదేవీలపై గతంలోనే వీరిని అధికారులు ప్రశ్నించారు. ఈ విచారణలో బెట్టింగ్ యాప్స్ (Betting App Case)కు ఎందుకు ప్రమోట్ చేశారు?. అందుకు ఎంతెంత తీసుకున్నారు?. యాప్ నిర్వాహకులతో చేసుకున్న ఒప్పందాలపై వీరి నుంచి అధికారులు ఆరా తీసినట్లు తెలిసింది. మధ్యవర్తులు ఎవరైనా ఉన్నారా..? అనే కోణంలో కూడా విచారణ సాగింది. యాప్స్ ప్రమోట్ ద్వారా వచ్చిన పారితోషికం.. బ్యాంక్ ఖాతాల ద్వారా తీసుకన్నారా లేకా నగదు రూపంలో తీసుకున్నారా? అని ప్రశ్నించారు. లక్షలాది మంది ఫాలోవర్లు ఉన్న వీరు, యువతను తప్పు దారి పట్టించేలా ఇలాంటి ప్రమాదకరమైన యాప్స్ ను ఎందుకు ప్రోత్సహించారని సీఐడీ గట్టిగానే మొట్టికాయలు వేసినట్లు సమాచారం.
Read Also: మేం పారిపోయినవాళ్లం.. మాల్యా, మోదీ వ్యంగ్యం
Follow Us On: X(Twitter)


