కలం, వెబ్ డెస్క్: దేశవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన చర్చిల్లో సందడి మొదలైంది. తెలంగాణలో అతిపెద్ద చర్చి అయిన మెదక్ చర్చి (Medak Church) క్రిస్టియన్లను ఆకర్షిస్తోంది. రంగురంగుల విద్యుత్ దీపాలు, నక్షత్రాల అలంకరణలతో ముస్తాబైంది. క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. గురువారం ఉదయం నుంచే ప్రత్యేక ప్రార్థనలు మొదలయ్యాయి.
100 సంవత్సరాలకుపైగా చరిత్ర కలిగిన మెదక్ చర్చి(Medak Church)కి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, దేశంలోని ఇతర ప్రాంతాల నుండి క్రైస్తవులు భారీగా తరలివస్తుంటారు. క్రిస్మస్ వేడుకలను దృష్టిలో పెట్టుకొని చర్చి యాజమాన్యం భారీ ఏర్పాట్లు చేసింది. గురువారం ఉదయం నుంచే క్రిస్టియన్స్ మెదక్‌కు వస్తున్నారు. దీంతో పట్టణంలోని చాలా హోటళ్ళు, లాడ్జీలు పూర్తిగా నిండిపోయాయి. ఈ చర్చి నిర్మాణం 1914లో ప్రారంభమై 1924లో పూర్తయింది. ఇక ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం బయ్యారం చర్చిలో ప్రత్యేక ప్రార్థనల్లో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు. కేక్ కట్ చేసి క్రిస్టియన్లకు తినిపించారు.
Read Also: పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ నోటిఫికేషన్ విడుదల
Follow Us On: Pinterest


