epaper
Wednesday, February 18, 2026
epaper

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో తొలి ఫలితం చిట్యాలదే..!

కలం, నల్లగొండ బ్యూరో: ఉమ్మడి నల్లగొండ (Nalgonda) జిల్లాలో 17 మున్సిపాలిటీల్లో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభ‌మైంది. నల్లగొండ జిల్లా కేంద్రంలోని శ్రీ రామనంద తీర్థ ఇనిస్ట్యూట్ నిడమనురు సోషల్ వెల్ఫేర్ స్కూల్ బ్రాంచ్ లో కౌంటింగ్ ఏర్పాట్లు చేశారు. ఇందులో తొలి ఫలితం చిట్యాల (Chityal Result) మున్సిపాలిటీ రానుంది. చిట్యాల మున్సిపాలిటీలో మొత్తం 12 వార్డులు ఉన్నాయి. మొత్తం 12188 ఓట్లు ఉండగా 10,068 ఓట్లు పోల్ అయ్యాయి. ఒక్కో వార్డుకు ఒక్క టేబుల్ చొప్పున 12 టేబుల్స్ ఏర్పాటు చేశారు.

ఒక్కో టేబుల్ వద్ద ఒక కౌంటింగ్ సూపర్‌వైజ‌ర్‌, ముగ్గురు కౌంటింగ్ అసిస్టెంట్స్, మొత్తం నలుగురు సిబ్బందిని నియమించారు. ఒక్కో రౌండ్ కి 1000 ఓట్ల చొప్పున లెక్కింపు చేపడతారు. అయితే ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 17 మున్సిపాలిటీలో మొదటి రౌండ్ లొనే చిట్యాల మున్సిపాలిటీ (Chityal Municipality) ఫలితం తేలనుంది.

ఇప్పటికే స్ట్రాంగ్ రూములు తెరుచుకున్నాయి. చండూర్ మున్సిపాలిటీ సైతం మొదటి రౌండ్ లోనే ఫలితం తేలనుంది. మొత్తం చండూరు మున్సిపాలిటీలో పది వార్డులు ఉన్నాయి. మొత్తం 11370 ఓట్లు ఉండగా 10406 ఓట్లు పోల్ అయ్యాయి. ఒక్కో వార్డుకు ఒక్క టేబుల్ చొప్పున 10 టేబుల్స్ ఏర్పాటు చేశారు. మరోవైపు ఇప్పటికే పోస్టల్ ఓట్ల బ్యాలెట్ ఓట్ల లెక్కింపు చేపట్టారు. నల్లగొండ కార్పొరేషన్ లో 797 పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు మొదలుపెట్టారు.

Read Also: ఓట్ల లెక్కింపు వేళ బీజేపీ అభ్యర్థి మృతి

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>