Mobile Popup Ad
Mobile Popup Ad

చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం: బొలెరో ఢీకొని ఇద్దరు మృతి

కలం, వెబ్​ డెస్క్​ : చిత్తూరు (Chittoor) జిల్లా బైరెడ్డిపల్లె మండలంలోని చీలంపల్లి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన బొలెరో వాహనం ఒక ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు.

ఈ ప్రమాదంలో బైక్ పై వెళ్తున్న మొరం గ్రామానికి చెందిన హరి (30) తీవ్ర గాయాలపాలై సంఘటనా స్థలంలోనే మరణించాడు. మరో యువకుడు హేమకృష్ణ (30) తీవ్రంగా గాయపడటంతో వెంటనే పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి అతను కూడా తుదిశ్వాస విడిచాడు. మృతులిద్దరూ పలమనేరు మండలం మొరం గ్రామానికి చెందిన స్నేహితులు కావడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న బైరెడ్డిపల్లె పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>